🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౫౪వ శ్లోకం
అనుమితకుచకాఠిన్యామధివక్షఃపీఠమఙ్గజన్మరిపోః ।
ఆనన్దదాం భజే తామానఙ్గబ్రహ్మతత్త్వబోధసిరామ్ ॥౧.౫౪॥
🌷౧.౫౪వ శ్లోకం
అనుమితకుచకాఠిన్యామధివక్షఃపీఠమఙ్గజన్మరిపోః ।
ఆనన్దదాం భజే తామానఙ్గబ్రహ్మతత్త్వబోధసిరామ్ ॥౧.౫౪॥
🌷పదవిభాగం
అనుమిత-కుచ-కాఠిన్యామ్ అధివక్షః-పీఠమ్ అఙ్గ-జన్మ-రిపోః । ఆనన్దదాం భజే తామ్ ఆనఙ్గ-బ్రహ్మ-తత్త్వ-బోధ-సిరామ్ ॥౧.౫౪॥
🌷అన్వయం
అఙ్గజన్మరిపోః అధివక్షఃపీఠమ్ అనుమితకుచకాఠిన్యామ్ అనఙ్గబ్రహ్మతత్త్వబోధిసిరామ్ ఆనన్దదామ్ తామ్ భజే ॥౧.౫౪॥
🌷ప్రతిపదార్థం
అఙ్గ-జన్మ-రిపోః = శివుని యొక్క
అధివక్షః-పీఠమ్ = ఱొమ్ము అను పీటయందు
అనుమిత-కుచ-కాఠిన్యామ్ = అనుమానించబడ్డ కుచకఠినత గల
అనఙ్గ-బ్రహ్మ-తత్త్వ-బోధిసిరామ్ = మన్మథునిచే ప్రతిపాదించబడ్డ బ్రహ్మతత్త్వమును బోధించునాడియగు
ఆనన్ద-దామ్ = ఆనందమునొసగు
తామ్ = ఆమెను
భజే = సేవించెదను
🌷తాత్పర్యం
శివుని ఱొమ్మునందు అనుమానింపబడిన స్తనముల కఠినత గలిగిన మన్మథ ఋషి ప్రతిపాదిత బ్రహ్మతత్వమును బోధించు నాడియగు ఆ అమ్మవారిని భజించెదను.
No comments:
Post a Comment