🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౯వ శ్లోకం
ఆదృతకాఞ్చీనిలయామాద్యామారూఢయౌవనాటోపామ్ ।
ఆగమవతంసకలికామానన్దాద్వైతకన్దలీం వన్దే ॥౧.౯॥
🌷౧.౯వ శ్లోకం
ఆదృతకాఞ్చీనిలయామాద్యామారూఢయౌవనాటోపామ్ ।
ఆగమవతంసకలికామానన్దాద్వైతకన్దలీం వన్దే ॥౧.౯॥
🌷పదవిభాగం
ఆదృత-కాఞ్చీ-నిలయామ్ ఆద్యామ్ ఆరూఢ-యౌవన-ఆటోపామ్ । ఆగమ-వతంస-కలికామ్ ఆనన్దాద్వైత-కన్దలీం వన్దే ॥౧.౯॥
🌷అన్వయం
ఆదృతకాఞ్చీనిలయామ్ ఆద్యామ్ ఆరూఢ-యౌవనాటోపామ్ ఆగమ-వతంసకలికామ్ ఆనన్దాద్వైతకన్దలీం వన్దే ॥౧.౯॥
🌷ప్రతిపదార్థం
ఆదృత-కాఞ్చీ-నిలయామ్ = కాంచీనగర నిలయమునందు ఆదరము గల
ఆద్యామ్ = ఆద్యురాలయిన
ఆరూఢ-యౌవన-ఆటోపామ్ = యౌవన గర్వమునెక్కిన
ఆగమ-వతంస-కలికామ్ = వేదములు తమ శిరముల యందు శిరోభూషణముగా ధరించిన మొగ్గయగు
ఆనన్ద-అద్వైత-కన్దలీమ్ = ఆనందాద్వైత వృక్షమునకు మొలక యగు
దేవీమ్ = దేవిని గూర్చి
వన్దే = నమస్కరించుచున్నాను
🌷తాత్పర్యం
కాంచీనగర విహారమునందు ఆదరము కలది అయి, అభివ్యక్త యౌవనాటోపము గలది అగు ఆనంద రూపమగు అద్వైత తంత్రమునకు సారాంశమై ఆగమ శిఖలందు అలంకరించిన ఒక చిన్ని మొలకకు మొక్కెదను.
No comments:
Post a Comment