Friday, July 27, 2018

ఆర్యా 1.56

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౫౬వ శ్లోకం
ఆహితవిలాసభఙ్గీమాబ్రహ్మస్తమ్బశిల్పకల్పనయా ।
ఆశ్రితకాఞ్చీమతులామాద్యాం విస్ఫూర్తిమాద్రియే విద్యామ్ ॥౧.౫౬॥

🌷పదవిభాగం
ఆహిత-విలాస-భఙ్గీమ్ ఆబ్రహ్మ-స్తమ్బ-శిల్ప-కల్పనయా । ఆశ్రిత-కాఞ్చీమ్ అతులామ్ ఆద్యాం విస్ఫూర్తిమ్ ఆద్రియే విద్యామ్ ॥౧.౫౬॥

🌷అన్వయం
ఆబ్రహ్మస్తమ్బశిల్పకల్పనయా అహితవిలాసభఙ్గీమ్ ఆశ్రితకాఞ్చీమ్ అతులామ్ ఆద్యామ్ విస్ఫూర్తిం విద్యామ్ ఆద్రియే ॥౧.౫౬॥

🌷ప్రతిపదార్థం
ఆబ్రహ్మ-స్తమ్బ-శిల్ప-కల్పనయా = బ్రహ్మ మొదలు స్తంభము వరకు గల శిల్పముల యొక్క కల్పన చేత
అహిత-విలాస-భఙ్గీమ్ = చేయబడిన విలాస రీతులుగల
ఆశ్రిత-కాఞ్చీమ్ = కాంచీ నగరమును ఆశ్రయించిన
అతులామ్ = సాటిలేని
ఆద్యామ్ = మొదటి
విస్ఫూర్తిమ్ = విస్ఫురణరూపమైన
విద్యామ్ = విద్యను {అమ్మవారిని}
ఆద్రియే = ఆదరించెదను

🌷తాత్పర్యం
ఆబ్రహ్మ స్తంబ జీవుల కల్పనం ఆమె విలాసము. ఆ ఆద్యా విస్ఫూర్తి రూపిణియగు సాటిలేని కాంచీ నగరమును ఆశ్రయించిన విద్యను ఆశ్రయించెదను.

No comments:

Post a Comment