Thursday, July 26, 2018

ఆర్యా 1.13

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౧౩వ శ్లోకం
ఆమ్రతరుమూలవసతేరాదిమపురుషస్య నయనపీయూషమ్ ।
ఆరబ్ధయౌవనోత్సవమామ్నాయరహస్యమన్తరవలమ్బే ॥౧.౧౩॥
 
🌷పదవిభాగం
ఆమ్ర-తరు-మూల-వసతేః ఆదిమ-పురుషస్య నయన-పీయూషమ్ । ఆరబ్ధ-యౌవన-ఉత్సవమ్ ఆమ్నాయ-రహస్యమ్ అన్తః అవలమ్బే ॥౧.౧౩॥
 
🌷అన్వయం
ఆమ్రతరుమూలవసతేః ఆదిమపురుషస్య నయనపీయూషమ్ ఆరమ్భయౌవనోత్సవమ్ ఆమ్నాయరహస్యమ్ అన్తః అవలమ్బే ॥౧.౧౩॥
 
🌷ప్రతిపదార్థం
ఆమ్ర-తరు-మూల-వసతేః = ఆమ్రవృక్షము యొక్క మూలము నివాసముగాగల
ఆదిమ-పురుషస్య = మొదటిపురుషుడయిన శివునియొక్క
నయన-పీయూషమ్ = నేత్రామృతమయిన
ఆరమ్భ-యౌవన-ఉత్సవమ్ = యౌవనోత్సవము నారంభించిన
ఆమ్నాయ-రహస్యమ్ = వేదగుహ్యమును
అన్తః = లోపల
అవలమ్బే = పట్టుకొనియుందును
 
🌷తాత్పర్యం
ఏ ఆమ్ర వృక్షము క్రింద వసించే ఆదిమ పురుషుని చూపులకు అమృతమయి నూతన యౌవనోత్సవము గలదియగు ఆమ్నాయములలోని రహస్యమును నాలో అవలంబము చేసికొందును.

No comments:

Post a Comment