🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౪౮వ శ్లోకం
శివ శివ పశ్యన్తి సమం శ్రీకామాక్షీకటాక్షితాః పురుషాః ।
విపినం భవనమమిత్రం మిత్రం లోష్ఠం చ యువతిబిమ్బోష్ఠమ్ ॥౧.౪౮॥
🌷౧.౪౮వ శ్లోకం
శివ శివ పశ్యన్తి సమం శ్రీకామాక్షీకటాక్షితాః పురుషాః ।
విపినం భవనమమిత్రం మిత్రం లోష్ఠం చ యువతిబిమ్బోష్ఠమ్ ॥౧.౪౮॥
🌷పదవిభాగం
శివ శివ పశ్యన్తి సమం శ్రీకామాక్షీకటాక్షితాః పురుషాః విపినం భవనమ్ అమిత్రం మిత్రం లోష్ఠం చ యువతి-బిమ్బ-ఓష్ఠమ్ ॥౧.౪౮॥
🌷అన్వయం
శ్రీకామాక్షీకటాక్షితాః పురుషాః విపినం భవనమ్ అమిత్రం మిత్రం లోష్ఠం చ యువతి-బిమ్బ-ఓష్ఠం సమం పశ్యన్తి ॥౧.౪౮॥
🌷ప్రతిపదార్థం
శ్రీకామాక్షీ-కటాక్షితాః = శ్రీకామాక్షిదేవి చేత చూడబడిన
పురుషాః = పురుషులు
విపినమ్ = అడవిని
భవనమ్ = ఇల్లుగా
భవనమ్ = ఇల్లును
విపినమ్ = అడవిగా
అమిత్రమ్ = శత్రువును
మిత్రమ్ = మిత్రునిగా
యువతిబిమ్బోష్టమ్ = స్త్రీపెదవులను
లోష్టమ్ చ = మట్టిబెడ్డగాను
సమం = సమముగా
పశ్యన్తి = చూచెదరు
శివ శివ = విచిత్రము
🌷తాత్పర్యం
శ్రీదేవీ కటాక్షమునకు పాత్రులయిన పురుషులు అడవిని ఇల్లుగా, ఇల్లును అడవిగా శత్రువును మిత్రునిగా మిత్రుని శత్రువుగా, మట్టిబెడ్డను యువతి అధరమువలె, యువతి బింబోష్ఠమును మట్టిబెడ్డవలె చూచెదరు. శివ! శివ! ఇది విచిత్రము గదా!
ఈ శ్లోకమున అమ్మవారి కటాక్షమునకు పాత్రులయిన వారి సిద్ధి చెప్పబడినది.
No comments:
Post a Comment