🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౪౧వ శ్లోకం
బాధాకరీం భవాబ్ధేరాధారాద్యమ్బుజేషు విచరన్తీమ్ ।
ఆధారీకృతకాఞ్చీం బోధామృతవీచిమేవ విమృశామః ॥౧.౪౧॥
🌷౧.౪౧వ శ్లోకం
బాధాకరీం భవాబ్ధేరాధారాద్యమ్బుజేషు విచరన్తీమ్ ।
ఆధారీకృతకాఞ్చీం బోధామృతవీచిమేవ విమృశామః ॥౧.౪౧॥
🌷పదవిభాగం
బాధాకరీం భవాబ్ధేః ఆధార-ఆది-అమ్బుజేషు విచరన్తీమ్ । ఆధారీకృతకాఞ్చీం బోధామృతవీచిమేవ విమృశామః ॥౧.౪౧॥
🌷అన్వయం
భవాబ్ధేః బాధాకరీమ్, ఆధారాద్యమ్బుజేషు విచరన్తీమ్, ఆధారీకృతకాఞ్చీమ్, బోధామృతవీచిమ్ ఏవ విమృశామః ॥౧.౪౧॥
🌷ప్రతిపదార్థం
భవాబ్ధేః = సంసార సముద్రమునకు
బాధాకరీమ్ = బాధను కలిగించు
ఆధారాది-అమ్బుజేషు = ఆధారము మొదలగు కమలములందు
విచరన్తీమ్ = బాగుగా తిరుగు
ఆధారీకృత-కాఞ్చీమ్ = ఆధారముగా చేసికొన్న కాంచీపురము గల
బోధ-అమృత-వీచిమ్ ఏవ = జ్ఞానామృత తరంగముచే
విమృశామః = చింతించెదము
🌷తాత్పర్యం
సంసార సముద్రమును బాధించు ఆధారాది కమలములలో విహరించు కాంచీనగరమును
అధారముగా చేసికొన్న జ్ఞానామృత తరంగమును ఆశ్రయించెదను.
No comments:
Post a Comment