Friday, July 27, 2018

ఆర్యా 1.59

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౫౯వ శ్లోకం
పరిణతవతీం చతుర్ధా పదవీం సుధియాం సమేత్య సౌషుమ్నీమ్ ।
పఞ్చాదశవర్ణకల్పితపదశిల్పాం తాం నమామి కామాక్షీమ్ ॥౧.౫౯॥

🌷పదవిభాగం
పరిణతవతీం చతుర్ధా పదవీం సుధియాం సమేత్య సౌషుమ్నీమ్ । పఞ్చాదశ-వర్ణ-కల్పిత-పద-శిల్పాం తాం నమామి కామాక్షీమ్ ॥౧.౫౯॥

🌷అన్వయం
సుధియామ్ సౌషుమ్నీమ్ పదవీమ్ సమేత్య చతుర్ధా పరిణతవతీమ్ పంచాశద్వర్ణకల్పిత-పదశిల్పామ్ తామ్ కామాక్షీమ్ నమామి ॥౧.౫౯॥

🌷ప్రతిపదార్థం
సుధియామ్ = విద్వాంసుల యొక్క
సౌషుమ్నీమ్ = సుషుమ్నా నాడికి చెందిన
పదవీమ్ = మార్గమును
సమేత్య = పొంది
చతుర్ధా = నాల్గు విధములుగా
పరిణతవతీమ్ = పరిణామములు గల
పంచాశద్-వర్ణ-కల్పిత-పదశిల్పామ్ = ఏబది వర్ణములతో కల్పించబడిన పదముల శిల్పము గల
తామ్ = ఆ
కామాక్షీమ్ = కామాక్షీ దేవిని గూర్చి
నమామి = నమస్కరించెదను

🌷తాత్పర్యం
విద్వాంసుల సుషుమ్నా నాడిలో పరాపశ్యంత్యాది చతుర్విధ పరిణామములను అందిన ఏబది వర్ణములలో పదశిల్పములను ఎన్నిటినో కల్పించిన ఆ కామాక్షీ దేవికి మ్రొక్కెదను.

No comments:

Post a Comment