Thursday, July 26, 2018

ఆర్యా 1.28

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౨౮వ శ్లోకం
ఏణశిశుదీర్ఘలోచనమేనఃపరిపన్థి సన్తతం నమతామ్ ।
ఏకామ్రనాథజీవితమేవం పదదూరమేకమవలమ్బే ॥౧.౨౮॥

🌷పదవిభాగం
ఏణ-శిశు-దీర్ఘ-లోచనమ్ ఏనః పరిపన్థి సన్తతం నమతామ్ । ఏకామ్రనాథ-జీవితమ్ ఏవం పద-దూరమ్ ఏకమ్ అవలమ్బే ॥

🌷అన్వయం
ఏణశిశుదీర్ఘలోచనమ్ సన్తతం నమతామ్ ఏనఃపరిపన్థి ఏవమ్పదదూరమ్ ఏకామ్రనాథజీవితమ్ ఏకమ్ అవలమ్బే ॥౧.౨౮॥

🌷ప్రతిపదార్థం
ఏణ-శిశు-దీర్ఘ-లోచనమ్ = జింకపిల్ల కన్నుల వలె పొడవయిన కన్నులుగల
సన్తతమ్ = ఎల్లప్పుడు
నమతామ్ = నమస్కరించువారి యొక్క
ఏనః-పరిపంథి = పాపములకు విరోధియగు
ఏవం-పద-దూరమ్ = ఇటువంటిది అని చెప్పలేని
ఏకమ్ = ఒక
ఏకామ్రనాథ-జీవితమ్ = ఏకామ్రనాథుని జీవితమును
అవలమ్బే = ఆశ్రయించెదను

🌷తాత్పర్యం
లేడిపిల్ల కనులవంటి సోగలైన కన్నులు గలది, మొక్కెడి వారి పాపములు హరించునది, ఏకామ్రనాథుని జీవితమైనది, అట్టిట్టిది అనరానిది యగు ఏకైక బ్రహ్మవస్తువును నాకాధారముగా గైకొనుచున్నాను.

No comments:

Post a Comment