🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౫౨వ శ్లోకం
నన్దతి మమ హృది కాచన మన్దిరయన్తీ నిరన్తరం కాఞ్చీమ్ ।
ఇన్దురవిమణ్డలకుచా బిన్దువియన్నాదపరిణతా తరుణీ ॥౧.౫౩॥
🌷౧.౫౨వ శ్లోకం
నన్దతి మమ హృది కాచన మన్దిరయన్తీ నిరన్తరం కాఞ్చీమ్ ।
ఇన్దురవిమణ్డలకుచా బిన్దువియన్నాదపరిణతా తరుణీ ॥౧.౫౩॥
🌷పదవిభాగం
నన్దతి మమ హృది కాచన మన్దిరయన్తీ నిరన్తరం కాఞ్చీమ్ । ఇన్దు-రవి-మణ్డల-కుచా బిన్దు-వియత్-నాద-పరిణతా తరుణీ ॥౧.౫౩॥
🌷అన్వయం
నిరన్తరం కాఞ్చీమ్ మన్దిరయన్తీ ఇన్దు-రవి-మణ్డల-కుచా బిన్దు-వియత్-నాద-పరిణతా కాచన తరుణీ మమ హృది నన్దతి ॥౧.౫౩॥
🌷ప్రతిపదార్థం
నిరన్తరమ్ = ఎల్లప్పుడు
కాఞ్చీమ్ = కాంచీపురిని
మన్దిరయన్తీ = ఇల్లుగా చేసికొనుచున్న
ఇన్దు-రవి-మణ్డల-కుచా = సూర్యచంద్రమండలములే స్తనములుగాగల
బిన్దు-వియన్నాద-పరిణతా = బిందువుగా ఆకాశముగా నాదముగా పరిణమించిన
కాచన = ఒకానొక
తరుణీ = యువతి
మమ = నా యొక్క
హృది = మనస్సునందు
నన్దతి = ఆనందించుచున్నది
🌷తాత్పర్యం
ఎల్లప్పుడు కాంచిపురినే నివాసము చేసికొన్న, సూర్య చంద్రమండలములే పాలిండ్లుగా గల బిందువుగా ఆకాశముగా, నాదముగా, పరిణమించిన ఒక తరుణి నా హృదయములో ఆనందించుచున్నది.
No comments:
Post a Comment